జగిత్యాల పట్టణంలోని టవర్ సర్కిల్ శివవీధిలో సోమవారం సాయంత్రం నిర్మాణంలో ఉన్న భవనం గోడకూలి పక్కనే ఉన్న పెంకుటిళ్లుపై పడిపోయింది. ఈ ఘటనలో హరికృష్టయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. నిర్మాణదారుల నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని.. నిర్మాణదారుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధిత కుటుంబసభ్యులు ఆందోళన చేపట్టారు.
న్యాయం చేయాలంటూ మృతదేహంతో ఆందోళన - jagitial latest news
జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి ఓ వ్యక్తి మృతిచెందాడు. న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబసభ్యులు మృతదేహంతో ఆందోళనకు దిగారు.
నిర్మాణ గోడ కూలి వ్యక్తి మృతి
న్యాయం జరిగే వరకు మృతదేహాన్ని తరలించబోమని భీష్మించుకు కూర్చున్నారు. నిర్మాణం అక్రమమని… అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వగా.. బాధిత కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
ఇవీ చదవండి:మూడోదశలో చిన్నారులకు కరోనా ముప్పు