మొండెంలేని తలను చూసి స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. కేవలం తల మాత్రమే ఉండడంతో ఎక్కడో హత్య చేసి తలను ఇక్కడ పడేసి ఉంటారని అనుమానించారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో మొండెం లేని మనిషి తలను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. వెంటనే ఆ దృశ్యాన్ని తమ సెల్‌ఫోన్లలో బంధించారు. విషయం పోలీసులకు తెలియడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఆ తలను ఓ సంచిలో వేసి అక్కడి నుంచి తొలగించారు.
ఇదీ చూడండి:MURDER : గొంతులో పొడిచి.. మెడకు చున్నీ బిగించి.. ప్రేమోన్మాది ఘాతుకం
అసలేం జరిగింది..?
ఖమ్మం రైల్వేలో గ్యాంగ్ మ్యాన్‌గా పని చేస్తూ రైల్వేకార్టర్స్‌లో ఉంటున్న గుగులోతు రాంజీ కుమారుడు గుగులోతు రాజు(28)కు గతేడాది వివాహం జరిగింది. రెండు నెలల క్రితం భార్య ప్రసవించి పుట్టింట్లో ఉంటుంది. ఈ క్రమంలో రాజు మద్యానికి బానిసయ్యాడు. బుధవారం మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని తండ్రితో గొడవపడ్డారు. ఆయన ఇవ్వనని చెప్పడంతో మనస్తాపానికి గురై రాత్రి 9:30 గంటల ప్రాంతంలో నగరంలోని నర్తకి థియేటర్ సమీపంలో రైలు వస్తున్న సమయంలో ఎదురుగా వెళ్లి పట్టాలపై తల పెట్టాడు. దీంతో తల, మొండెం రెండుగా వేరై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయాన్ని లోకో పైలట్ ఖమ్మం స్టేషన్ మాస్టర్‌కు తెలియజేశారు. రైల్వే పోలీసులు(జీఆర్‌పీ) మృతదేహం కోసం ప్రకాశ్‌నగర్ రైల్వే వంతెన దగ్గర నుంచి ధంసలాపురం గేటు వరకు వెతికారు. మృతదేహం లభించకపోవడం, అప్పటికే వర్షం ప్రారంభం కావడంతో వెనక్కి వచ్చేశారు. గురువారం ఉదయం నర్తకి థియేటర్ ఎదురుగా రైలు పట్టాలపై శవం పడి ఉండడాన్ని గమనించిన ఓ కుక్క మొండెం నుంచి వేరైన తలను పట్టుకుని పరుగు లంకించుకుంది. దానిని ప్రకాశ్‌నగర్ వంతెన వద్ద రోడ్డుపైనే పడేసి వెళ్లిపోయింది.