ఇంటి నిర్మాణం కోసం తెచ్చిన అప్పు ఎలా తీర్చాలనే బెంగతో వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అశోక్.. బీహెచ్ఈఎల్ పరిశ్రమలో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇంటి నిర్మాణం కోసం తెలిసిన వ్యక్తుల నుంచి రూ. 14 లక్షలు అప్పు తెచ్చాడు. ఈ మొత్తం ఎలా తీర్చాలో తెలియక మద్యానికి బానిసయ్యాడు.
ఫ్యాన్‌కు ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్య - Telangana crime news
రంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్‌లో ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు ఎలా తీర్చాలనే బెంగతో బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

'అప్పు ఎలా తీర్చాలనే బెంగతో వ్యక్తి ఆత్మహత్య'
ఇదే విషయం భార్యాపిల్లలతో ప్రస్తావించేవాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
- ఇదీ చదవండి:తప్పుల తడకగా అదనపు మార్కులు