సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ముత్తంగి గ్రామానికి చెందిన మల్లేష్ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. మల్లేష్ తమ్ముడు శీను, అతడి భార్య రితన్య ఆస్తి విషయంలో మల్లేష్తో గొడవ పెట్టుకున్నారు. ఆస్తి కోసం తమ్ముడు మరదలు తనతో గొడవపడడం జీర్ణించుకోలేని మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు.
తమ్ముడి గొడవతో వ్యక్తి మనస్తాపం.. ఆత్మహత్య - సంగారెడ్డిలో వ్యక్తి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లాలో తమ్ముడు అతని భార్య ఆస్తి గురించి తనతో గొడవ పడడం జీర్ణించుకోలేని ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తమ్ముడి గొడవతో వ్యక్తి మనస్తాపం.. ఆత్మహత్య
ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పటాన్చెరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.