ప్రేమ విఫలమైందని ఓ వివాహితుడు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాకు చెందిన షేక్ బ్రహ్మం (34) శనివారం ఉదయం నగరానికి చేరుకుని వనస్థలిపురం పీఎస్ పరిధిలోని ఓ లాడ్జిలో రూం తీసుకున్నాడు. సాయంత్రం పూటుగా మద్యం సేవించి రాత్రి 8 గంటల సమయంలో తన రూంకు వెళ్లాడు.
తన ప్రేమ విఫలమైందని.. స్నేహితులు కూడా తనని మోసం చేశారని తెలిపాడు. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని సెల్ఫ్ వీడియోలో పేర్కొన్నాడు. ఈ విషయం తన తల్లికి, భార్యకు తెలియాలనే సెల్పీ వీడియో తీస్తున్నట్లు ఫేస్బుక్ లైవ్‌లో పేర్కొన్నాడు. విషయం తెలుసుకున్న వనస్థలిపురం పోలీసులు హుటాహుటినా.. ఘటనా స్థలానికి చేరుకున్నారు. లాడ్జీలోని రూం తలుపులు బద్దలు కొట్టి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.