యాదాద్రి భువనగిరి జిల్లా సాయి గూడెంకు చెందిన జన్నే భిక్షపతి గతంలో.. తన టాటా ఏసీ వాహనం రిపేరుకు రావడంతో పట్టణంలోని ఎస్ఎస్ ఆటోమొబైల్ షాపునకు వెళ్లాడు. డబ్బు తరువాత ఇస్తానని చెప్పి.. వాహన విడి భాగాలను కొనుగోలు చేశాడు. ఎన్నిసార్లు అడిగినా డబ్బులు ఇవ్వకపోవడంతో.. ఆగ్రహానికి గురైన షాపు యజమాని ఇవాళ ఉదయం భిక్షపతితో గొడవపడి అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు.
వ్యక్తి ఆత్మహత్య.. మృతదేహంతో బంధువుల ఆందోళన - బలవన్మరణాలు
మృతదేహంతో ఓ ఆటోమొబైల్ షాపు ముందు.. బంధువులు ఆందోళన చేపట్టిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పరిధిలో చోటుచేసుకుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

man commits suicide
తీవ్ర మనస్తాపానికి గురైన భిక్షపతి.. ఇంటికి వచ్చి ఊరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహంతో స్థానికులు ఆటోమొబైల్ షాపు ముందు బైఠాయించి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి:బంధువుపై.. కత్తితో దాడికి పాల్పడ్డ యువకుడు