Suicide attempt: ప్రగతిభవన్ వద్ద పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం - suicide attempt at pragathi bhavan
16:15 July 14
Suicide attempt: ప్రగతిభవన్ వద్ద పెట్రోల్ పోసుకొని వ్యక్తి ఆత్మహత్యాయత్నం
ప్రగతిభవన్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటకు చెందిన మొయినుద్దీన్.. మధ్యాహ్నం ఆటోలో ప్రగతిభవన్ వద్దకు వెళ్లాడు. గేటు దగ్గర ఆటోలో దిగిన వెంటనే తనతో పాటు తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకున్నాడు.
అక్కడున్న పోలీసులు వెంటనే అప్రమత్తమై అతడిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి పంపించారు. తన ఇల్లు, భూమిని బంధువులు ఆక్రమించుకున్నారని మొయినుద్దీన్ ఆరోపించాడు. ఆక్రమణకు గురైన భూమి విషయంలో న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు.