జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని ఐదో అంతస్తు నుంచి దూకి గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని కొవిడ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు ఇంకా తెలియరాలేదు.
ఆస్పత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య - గుర్తుతెలియని వ్యక్తి బలవన్మరణం

07:40 April 26
నిజామాబాద్లో ఆస్పత్రి భవనంపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య
ఈ ఘటన వేకువజామున మూడు గంటలకు జరిగినట్లు భద్రత సిబ్బంది తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఒకటో పట్టణ పోలీసులు తెలిపారు.
అతను పేషంట్ కాదు: కలెక్టర్
నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకున్న ఈ ఘటనపై కలెక్టర్ నారాయణ రెడ్డి స్పందించారు. ప్రభుత్వ ఆస్పత్రితో సంబంధంలేని ఒక వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. అతను పేషెంట్ కాదని జిల్లా పాలనాధికారి స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసు శాఖ విచారణ చేపట్టిందని పేర్కొన్నారు.