మున్సిపల్ సిబ్బంది వేధిస్తున్నారంటూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లిలో చోటు చేసుకుంది. తనపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ.. అమ్మకాలను అడ్డుకుంటున్నారంటూ ఓ కొబ్బరిబొండాల వ్యాపారి.. సిబ్బందిపై ఆరోపణలు చేశాడు. 'వ్యాపారాన్ని నిలిపివేస్తే.. నాకు చావే దిక్కు' అంటూ మెడపై కత్తి పెట్టుకుని సెల్ఫీ వీడియోలో వాపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
'అమ్మకాలు జరపాలంటే.. డబ్బులివ్వాలని నన్ను చాలా రోజుల నుంచి హింసిస్తున్నారు. బండి లాక్కుంటామంటున్నారు. రోడ్డు పక్కన ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి. వ్యాపారాన్ని మరో చోటుకు మార్చుకునేందుకు కాస్త సమయం కూడా ఇవ్వకుండా నాపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు.'