Old City Murder: పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య.. కత్తిపోట్లతో నగ్నంగా.. - man found dead and nude in Hyderabad
11:20 September 21
పాతబస్తీలో వ్యక్తి దారుణ హత్య
హైదరాబాద్ పాతబస్తీలో దారుణం చోటుచేసుకుంది. చాంద్రాయణగుట్ట పరిధిలోని లేక్‌వ్యూ హిల్స్ ప్రాంతంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. అతణ్ని హత్య చేసి దుండగులు నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. అటుగా వెళ్తున్న స్థానికులు శరీరంపై దుస్తులు లేని స్థితిలో మృతదేహాన్నిగమనించి పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. వ్యక్తి మృతదేహంపై కత్తిపోట్లు ఉండటం గమనించారు. అతడు ఏ ప్రాంతానికి చెందినవాడో, ఎవరు హతమార్చి ఉంటారనే విషయాలపై ఆరా తీస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్ స్క్వాడ్‌ను రప్పించిన పోలీసులు.... ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.