తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఇంటి యజమాని మనవడిపై కత్తితో దాడి - సంగారెడ్డి తాజా క్రైమ్ వార్తలు

గత మూడేళ్లుగా ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. డబ్బుల విషయంలో యజమాని మనవడితో గొడవపడి... ఆవేశంలో కత్తితో దాడి చేశాడు. గొంతు, చేతివేళ్లు కోసి పరారయ్యాడు.

man attempt to murder
ఇంటి యజమాని మనవడిపై కత్తితో దాడి

By

Published : May 22, 2021, 9:04 AM IST

ఇంట్లో అద్దెకుంటున్న ఓ వ్యక్తి ఆ ఇంటి యజమాని మనవడిపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన పటాన్​చెరు పోలీస్ స్టేషన్​ పరిధిలో జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు జేపీ కాలనీ రెండో నంబర్ రహదారికి చెందిన ఓ ఇంట్లో రాజు అనే వ్యక్తి మూడు సంవత్సరాలుగా అద్దెకు ఉంటున్నాడు. అయితే ఆ ఇంటి యజమాని మనవడు దినేష్​కు రాజుకు డబ్బు విషయంలో గొడవ జరిగింది.

కోపోద్రిక్తుడైన రాజు కత్తితో దినేష్ గొంతు కోసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటిండం వల్ల దినేష్​కు గొంతుతో పాటు చేతి వేళ్లు కూడా తెగి తీవ్ర గాయాలయ్యాయి. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు దినేష్​ను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారమిచ్చి రాజుపై కేసు నమోదు చేయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు.

ఇదీ చదవండి:అనాథలైన అక్కాచెల్లెల్లు... సాయం కోసం కన్నీళ్లతో ఎదురుచూపులు

ABOUT THE AUTHOR

...view details