తెలంగాణ

telangana

ETV Bharat / crime

Attack: భాజపా కౌన్సిలర్ సోదరుడిపై తెరాస కార్యకర్త దాడి.. పరిస్థితి విషమం! - నిర్మల్​ జిల్లాలో కత్తితో దాడి

ఓ యువకుడిపై అదే ప్రాంతానికి చెందిన మరో యువకుడు కత్తితో దాడి చేశాడు. గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తీసుకెళ్లిన కుటుంబ సభ్యులు... రాజకీయ నేపథ్యంలో దాడి జరిగిందని ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Attack
కత్తితో దాడి

By

Published : Jul 31, 2021, 12:26 PM IST

నిర్మల్​ జిల్లా కేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. బుధవార్​పేట్​ కాలనీకి చెందిన బొమ్మెడ అనీల్​పై... అదే కాలనీకి చెందిన శ్రీకాంత్​.. శుక్రవారం రాత్రి కత్తితో దాడి చేశాడు. తీవ్ర రక్తస్రావం అయిన అనిల్​ను... కుటుంబ సభ్యులు, స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనిల్​ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

కక్షలేనా?

రాజకీయ కక్షతోనే తన బావమరిదిపై దాడి చేశారని... భాజపా కౌన్సిలర్​ భర్త సైండ్ల శ్రీధర్ ఆరోపించారు. శ్రీకాంత్ తెరాసకు చెందిన వాడని... రాజకీయ కక్షతోనే అనిల్​పై దాడి చేశారని వ్యాఖ్యానించారు. ఇలాంటి నేరాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

బాధితుడి బావ చెప్పినట్లు ఈ ఘటన వెనుక రాజకీయ హస్తం ఉండొచ్చు, లేదా ఇద్దరి మధ్య విభేదాలు ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి... ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

ఇదీ చూడండి:అయ్యో పాపం... అడ్డొస్తున్నాడని పసివాడిని అమ్మమ్మే చంపేసింది!

భర్తను చంపి.. సాధారణ మరణంగా సృష్టించబోయి....

ABOUT THE AUTHOR

...view details