యూసఫ్‌గూడలోని బీఎన్ఆర్ హిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. లావణ్య, రమేష్ దంపతులు స్థానికంగా నివాసముంటున్నారు. వీరికి కుమార్తె కూడా ఉంది. రమేష్ మద్యానికి బానిసై... రోజూ తాగి భార్యను వేధించేవాడు. ఈనెల 26వ తేదీన కూడా రమేష్ తాగి వచ్చి భార్యతో గొడవపడ్డాడు.
మద్యం మత్తులో ఘర్షణ... కత్తితో దాడి
ఓ వ్యక్తి మద్యం మత్తులో భార్యతో ఘర్షణకు దిగాడు. మద్యం మానేయాలని భార్య కోరగా.. కోపోద్రిక్తుడై కత్తి విసిరాడు. ఈ ఘటనలో భార్య దాడి నుంచి తప్పించుకోగా... కత్తి నేరుగా అక్కడే ఉన్న కుమార్తెకు తగిలి తీవ్ర గాయమైంది. ఈ ఘటన యూసఫ్‌గూడ పరిధిలో చోటు చేసుకుంది.
మద్యం మత్తులో ఘర్షణ... కత్తితో దాడి
కోపోద్రిక్తుడైన అతను కూరగాయలు తరిగే కత్తిని భార్యపై విసిరాడు. లావణ్య తప్పించుకోగా... కత్తి నేరుగా అక్కడే ఉన్న కుమార్తె తలకు తగిలి తీవ్ర రక్తస్రావమైంది. ఈ ఘటనలోనే లావణ్య సోదరుని కుమారుడికి కూడా గాయలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చూడండి:కిరాతకం: కట్టుకున్నదాన్ని.. కడుపున పుట్టిన వాళ్లని వదల్లేదు