ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్న వ్యక్తిని హైదరాబాద్ సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రూప్ బజార్లో ఉంటున్న ఓ వ్యక్తి వాహనం ఇటీవల చోరీకి గురైంది. యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. కేసు దర్యాప్తులో భాగంగా సుల్తాన్ బజార్‌లోని ఆర్య సమాజ్ సమీపంలో వాహన తనిఖీలు చేపట్టారు.
Theft: ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు - ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు చేసిన సుల్తాన్ బజార్ పోలీసులు
గతంలో జైలుకి వెళ్లి వచ్చినా... తీరు మార్చుకోకుండా మళ్లీ దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. తాజాగా ఓ ద్విచక్రవాహనాన్ని చోరీ చేసి పోలీసులకు చిక్కాడు.
![Theft: ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్న వ్యక్తి అరెస్టు theft](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12139175-667-12139175-1623744587769.jpg)
ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపిన పోలీసులు అతని వివరాలు అడగ్గా... పొంతన లేని సమాధానాలు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు ఆరా తీయగా.. ద్విచక్రవాహనాన్ని చోరీ చేసినట్లు ఒప్పుకున్నాడు. నగరంలోని పలు పీఎస్‌లలో మొత్తం 8 కేసుల్లో సంతోష్ కుమార్ నిందితుడిగా ఉన్నాడు. గతంలోనూ జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంతోష్‌ను రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:Suicide: కరోనా టీకా వేసుకోమన్నారని.. యువకుడు ఆత్మహత్య