మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్కు చెందిన రవితేజ అనే వ్యక్తి బాలికకు దగ్గరయ్యాడు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు.
పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్ - మైనర్ బాలిక
మైనర్ బాలికను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తీసుకెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
పెళ్లి చేసుకుంటానని మైనర్ బాలికను తీసుకెళ్లిన వ్యక్తి అరెస్ట్
ఈ విషయాన్ని పోలీసులకు బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. వారి ఆచూకీ కనుగొన్న కుషాయిగూడ పోలీసులు రవితేజపై పోక్సో కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
ఇదీ చూడండి:శిశువు విక్రయం కేసును ఛేదించిన పోలీసులు