తెలంగాణ

telangana

ETV Bharat / crime

మద్యం అక్రమ రవాణా.. వ్యక్తి అరెస్ట్ - alcohal transported Illegally

మంచిర్యాల జిల్లా నస్పూర్ పరిధిలో.. ఆటోలో అక్రమంగా తరలిస్తోన్న మద్యం పోలీసులకు పట్టుబడింది. మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

smuggling alcohol
smuggling alcohol

By

Published : May 23, 2021, 5:55 PM IST

మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ గ్రామంలో.. ఆటోలో మద్యాన్ని అక్రమంగా తరలిస్తోన్న ఓ వ్యక్తిని.. రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.30 వేల విలువగల మద్యాన్ని సీజ్ చేశారు. అక్రమంగా తీసుకొచ్చిన మద్యాన్ని విక్రయిస్తోన్న పలువురు దుకాణాదారులనూ అరెస్టు చేశారు.

మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో మద్యపాన నిషేధం ఉండడంతో నిందితుడు గోపాల్.. శ్రీరాంపూర్ నుంచి ఆ రాష్ట్రానికి మద్యాన్ని అక్రమంగా తరలించడానికి యత్నించినట్లు పోలీసులు తెలిపారు. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం టాస్క్ ఫోర్స్ సీఐ మహేందర్ హెచ్చరించారు.

ఇదీ చదవండి:భార్యను చంపేసి... తానూ ఆత్మహత్య చేసుకున్నాడు..!

ABOUT THE AUTHOR

...view details