తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఉద్యోగాల పేరుతో లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్​

షారాపు పవన్ కుమార్... రాజకీయ నాయకుల ప్రతినిధినని చెబుతాడు. ఉద్యోగాల పేరుతో దగ్గరవుతాడు. అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అయితే ఓ బాధితురాలి ఫిర్యాదుతో అతని మోసాలకు చెక్​ పెట్టారు హైదరాబాద్ షా ఇనాయత్ గంజ్ పోలీసులు.

ఉద్యోగాల పేరుతో లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్​
ఉద్యోగాల పేరుతో లైంగికంగా వేధిస్తున్న వ్యక్తి అరెస్ట్​

By

Published : Apr 26, 2021, 7:04 PM IST

Updated : Apr 26, 2021, 11:40 PM IST

నిజామాబాద్ జిల్లా అంబం గ్రామానికి చెందిన షారాపు పవన్ కుమార్ రాజకీయ నాయకుల ప్రతినిధినని చెబుతాడు. ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసాలకు పాల్పడుతున్నట్లు సీఐ అజయ్ కుమార్ తెలిపారు. ఓ బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్​కి తరలించామన్నారు.

మహిళలను మోసం చేస్తూ... వారి అశ్లీల చిత్రాలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తున్న పవన్​ను కఠినంగా శిక్షించాలని స్థానిక మహిళా నాయకురాలు శీలం సరస్వతి కోరారు. ఈ కేసుపై ప్రత్యేక చొరవ తీసుకొని నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులను పలువురు మహిళలు అభినందించారు.

ఇదీ చూడండి: చిన్నారిపై అత్యాచారం.. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష

Last Updated : Apr 26, 2021, 11:40 PM IST

ABOUT THE AUTHOR

...view details