సరైన పత్రాలు లేని కార్లను ఓఎల్ఎక్స్లో విక్రయిస్తూ మోసాలకు పాల్పడుతోన్న వ్యక్తిని కూకట్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు.
లాభం బాగుందని..
విశాఖపట్నంకు చెందిన దంతులూరి కృష్ణంరాజు పీజీ చదువుకున్నాడు. పలు ఉద్యోగాలు చేశాడు. వ్యాపారాలూ చేసి నష్టాలు రావడంతో మిజోరాంకు చెందిన ఓ సంస్థలో మళ్లీ ఉద్యోగంలో చేరాడు. అదే సమయంలో మిజోరాంలో ఎండీ అఫ్రోజ్ అనే మధ్యవర్తి నుంచి కారు కొనుగోలు చేశాడు. కొద్ది రోజుల తరువాత ఆ కారును ఓఎల్ఎక్స్లో విక్రయించగా లాభం వచ్చింది. డబ్బులు సులభంగా సంపాదించేందుకు ఈ వ్యాపారం బాగుందని నిర్ణయించుకున్నాడు.
తక్కువకు కొని ఎక్కువకు..
'అందులో భాగంగా మధ్యవర్తి నుంచి సరైన పత్రాలు లేని.. ఇతర రాష్ట్రాల కార్లను తక్కువ ధరలకు కొనుగోలు చేసేవాడు. వాటిని ఓఎల్ఎక్స్లో ఎక్కువ ధరలకు విక్రయించేవాడు. అతడి నుంచి కొనుగోలు చేసిన వారికి కార్లు రిజిస్ట్రేషన్ కావడంలేదు. వారు కృష్ణంరాజును సంప్రదించేందుకు ప్రయత్నించగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. మోసపోయామని గ్రహించిన కార్ల కొనుగోలు దారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు' అని కూకట్‌పల్లి సీఐ నర్సింగరావు పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కృష్ణంరాజును అరెస్టు చేశారు. అతడి నుంచి లక్ష రూపాయల నగదు, మూడు కార్లను స్వాధీనం చేసుకొని.. రిమాండుకు తరలించారు.
ఇదీ చూడండి:యాదాద్రి అభివద్ధి పనుల పురోగతిపై మంత్రి అసంతృప్తి