గడువు తీరిన విత్తనాలు అమ్ముతున్నారన్న ఫిర్యాదుపై భువనగరిలోని రంగా కృష్ణయ్య అండ్‌కో దుకాణంలో వ్యవసాయ అధికారులు, పోలీసులు సోదాలు చేశారు. రూ. 18,140 విలువైన గడువు ముగిసిన విత్తనాలు (Expired seeds) ఉన్నట్లు గుర్తించారు. మండల వ్యవసాయాధికారి వెంకటేశ్వర్ రెడ్డి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు రంగా కృష్ణయ్యను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణ రెడ్డి వెల్లడించారు.
Expired seeds: గడువు తీరిన విత్తనాలు, క్రిమిసంహారకాలు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్ - భువనగరిలో రంగా కృష్ణ అండ్‌కో దుకాణ యజమాని అరెస్ట్
గడువు ముగిసిన విత్తనాలు, (Expired seeds) పురుగు మందులు విక్రయిస్తున్న వ్యక్తిని భువనగిరి పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. రైతుల నుంచి వచ్చి ఫిర్యాదుపై భువనగిరిలోని రంగా కృష్ణయ్య అండ్‌కో దుకాణంలో సోదాలు చేసి యజమానిని అదుపులోకి తీసుకున్నారు.
భువనగిరి వార్తలు
ఇలాంటివి అమ్ముతున్న వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. గడువు ముగిసిన విత్తనాలు, (Expired seeds) పురుగు మందులు, నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీయాక్టు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.