making adulterated milk: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లిలో కల్తీ పాలు తయారు చేస్తున్న పాల వ్యాపారి జంగారెడ్డి ఇంటిపై ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. నిందితుడు హైడ్రోజన్ పెరాక్సైడ్, గోల్డ్డ్రాప్ ఆయిల్, మిల్క్ పౌడర్ ఉపయోగించి కల్తీ పాలు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.
making adulterated milk: కల్తీ పాలు గుట్టురట్టు.. నిందితుడు అరెస్ట్ - హైదరాబాద్ తాజా నేర వార్తలు
making adulterated milk: కల్తీ పాలు తయారుచేస్తున్న కేటుగాడిని పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. నిందితుడి నుంచి 120 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది.
నిందితుడి నుంచి స్వాధీనం చేసుకున్న కల్తీ పాలు
జంగారెడ్డిపై కేసు నమోదు చేసి యాచారం పోలీసులకు అప్పగించారు. నిందితుడి నుంచి 120 లీటర్ల కల్తీ పాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి:Palvancha Suicide Case: వనమా రాఘవకు బెయిల్ మంజూరు