ఇళ్లలో చోరీలు చేయడంతో పాటు కల్లు కాంపౌండ్‌లో ఒంటరి మహిళలే లక్ష్యంగా అత్యాచారాలకు పాల్పడుతోన్న నిందితుడిని రాచకొండ ఎల్.బి.నగర్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి 90 గ్రాముల బంగారం, రూ.45 వేల నగదు, చరవాణితో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
చోరీలు, అత్యాచారాలకు పాల్పడుతోన్న వ్యక్తి అరెస్ట్: సీపీ
ఇళ్లలో చోరీలతో పాటు కల్లు కాంపౌండ్‌లో ఒంటరి మహిళలే లక్ష్యంగా అత్యాచారాలకు పాల్పడుతోన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నారపల్లికి చెందిన హుస్సేన్‌ఖాన్‌గా గుర్తించారు. అతడి వద్ద నుంచి నగదు, బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.
a thief arrested
ఘట్‌కేసర్ నారపల్లికి చెందిన హుస్సేన్‌ఖాన్ తాళం వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడేవాడని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. కల్లు కాంపౌండ్‌లకు వచ్చే ఒంటరి మహిళలపై కన్నేసి.. అత్యాచారాలకు పాల్పడేవాడని వివరించారు. జిల్లెలగూడలోని కల్లు కాంపౌండ్‌కు వచ్చిన ఓ మహిళపై హుస్సేన్‌ఖాన్ అత్యాచారానికి పాల్పడి, ఆమె బంగారు ఆభరణాలతో ఉడాయించినట్లు చెప్పారు. సాంకేతిక ఆధారాల ద్వారా నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.