సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలో నకిలీ విత్తనాలను అక్రమంగా తరిలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి.. 35 కేజీల విత్తనాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
Fake seeds: నకిలీ విత్తనాల పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ - counterfeit seeds cases
పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరిస్తున్నా.. నకిలీ విత్తనాలు చలామణి అవుతూనే ఉన్నాయి. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో నకిలీ విత్తనాలను తరలిస్తోన్న ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు.
![Fake seeds: నకిలీ విత్తనాల పట్టివేత.. ఇద్దరు అరెస్ట్ counterfeit seeds](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:50:23:1623558023-tg-nlg-61-13-nakili-vithanalu-av-ts10101-13062021094719-1306f-1623557839-429.jpg)
counterfeit seeds
విత్తనాలను.. నిందితుడు కుమురం భీం జిల్లా నుంచి తీసుకువస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అతడి సమాచారంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలానికి చెందిన మరో వ్యక్తి నుంచి 413 కేజీల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రైతులు.. నాణ్యత లేని విత్తనాలను కొని మోసపోవద్దని వారు సూచించారు.
ఇదీ చదవండి:సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫర్నిచర్