తెలంగాణ

telangana

ETV Bharat / crime

మల్లన్నసాగర్​ భూ నిర్వాసితుడు ఆత్మహత్య..

ఇంటి స్థలం ఇంకా రాలేదని మల్లన్నసాగర్​ నిర్వాసితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని రాజిరెడ్డిపల్లి శివారులో చోటుచేసుకుంది. మృతుడు దేవదాసు కుటుంబానికి న్యాయం చేసేవరకూ మృతదేహాన్ని తీసేది లేదంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. బాధితులతో గజ్వేల్ ఏసీపీ దాదాపు ఆరు గంటల చర్చల అనంతరం వారు శాంతించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు, కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ పరామర్శించారు.

Suicide: మల్లన్నసాగర్​ భూ నిర్వాసితుడు ఆత్మహత్య..
Suicide: మల్లన్నసాగర్​ భూ నిర్వాసితుడు ఆత్మహత్య..

By

Published : Feb 19, 2022, 8:55 PM IST

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ నియోజకవర్గ పరిధిలోని రాజిరెడ్డిపల్లి శివారులో మల్లన్నసాగర్ నిర్వాసితుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పల్లెపహాడ్ గ్రామానికి చెందిన గొడుగు దేవదాసు(35) మల్లన్నసాగర్‌లో భూమి కోల్పోయాడు. పరిహారం ప్యాకేజీ వచ్చినప్పటికీ ఇంటి స్థలం ఇంకా రాలేదు. అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేదనే మనస్తాపంతో దేవదాసు ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబసభ్యులు తెలిపారు.

దేవదాసు కుటుంబానికి న్యాయం చేసేవరకూ మృతదేహాన్ని తీసేది లేదంటూ ఆందోళన చేపట్టారు. బాధితులతో గజ్వేల్ ఏసీపీ రమేశ్‌ చర్చించారు. రెవెన్యూ అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని చెప్పినా.. నిరసన ఆపలేదు. సుమారు ఆరుగంటల పాటు చర్చల అనంతరం మృతదేహాన్ని గజ్వేల్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబసభ్యులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​ రావు, కాంగ్రెస్​ సీనియర్​ నేత వీహెచ్​ పరామర్శించారు. దేవదాసు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమైన విషయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అర్హులందరికీ నష్టపరిహారం కింద రావాల్సిన ప్యాకేజీలు రాకపోవడంతో ఇలా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రభుత్వ అధికారుల వైఫల్యం వల్లే ఇలా జరుగుతున్నాయని ఆరోపించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వారు డిమాండ్​ చేశారు. పరిహారం రాని మల్లన్న సాగర్​ నిర్వాసితులు ఎవరైనా ఉంటే తమదృష్టికి తీసుకురావాలన్నారు. అలాంటి బాధితులకు తక్షణమే పరిహారం అందే విధంగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. మృతుని కుటుంబానికి రావాల్సిన పరిహారంతో పాటు 25లక్షల పరిహారం ఇవ్వాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్టవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.

మల్లన్నసాగర్​ భూ నిర్వాసితుడు ఆత్మహత్య..

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details