Maoist Dump in AOB: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాబేరు, అర్లింగపాడు గ్రామాల సరిహద్దుల్లో అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టుల డంప్ లభించింది. ఐఈడీ బాంబులతో సహా పెద్దసంఖ్యలో ఆయుధ సామగ్రి పట్టుబడినట్లు మల్కన్‌గిరి పోలీసులు వెల్లడించారు.
అక్రమ ఆయుధాల తయారీ, భారీ బాంబులు, మందుపాతరలను మావోయిస్టులు తయారు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఆరు ఐఈడీ టిఫిన్ బాంబులు, రెండు ప్రెషర్ ఐఈడీలు, కోడెక్స్ వైర్, 7.62 బాల్ అమ్యునేషన్‌లు రెండు, ఒక ఇన్సాస్ మ్యాగజైన్, ఒక ఐఈడీ మెకానిజంతోపాటు ఇతర సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రధానంగా ఆయుధాలు తయారీతో పాటు మరమ్మతులు చేసేందుకు ఈ డంప్‌ను మావోయిస్టులు ఉపయోగించినట్లు పోలీసులు గుర్తిచారు.
ఈ నెల 25న భారీ డంప్ పట్టివేత..
Maoist Dump Seized : ఈనెల 25వ తేదీన ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన ఓ భారీ డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జొడొంబో పోలీస్ స్టేషన్ పరిధిలోని కటాఫ్ ఏరియా ప్రాంతంలో.. ఒడిశా మల్కన్‌గిరి పోలీసులు ఇంటెన్సివ్ సెర్చ్, ఏరియా డామినేషన్ నిర్వహించగా భారీ డంప్ బయటపడింది. ఇందులో పేలుడు సామగ్రి, యంత్రాలు ఉన్నాయి.