ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం యాదగిరిపల్లిలో జరిగిందీ ఘటన. నిందితుల నుంచి రూ. లక్ష నగదుతో పాటు మూడు చరవాణులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
కీసరలో క్రికెట్ బెట్టింగ్.. ఇద్దరి అరెస్ట్ - ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్
ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతున్న నేపథ్యంలో.. అనేక చోట్ల బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. ఇలాగే మేడ్చల్ జిల్లా కీసరలో గుట్టు చప్పుడు కాకుండా ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతోన్న ఇద్దరు పోలీసులకు చిక్కారు.
క్రికెట్ బెట్టింగ్ అరెస్ట్
ప్రధాన నిందితుడు చైతన్య వర్మ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. రామకృష్ణ రాజు, శ్రీధర్‌లను రిమాండ్‌కు తరలించినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి:కరోనాతో మరో ఇద్దరు సచివాలయ ఉద్యోగులు మృతి