హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో.. దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ. 12లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు మల్కాజ్గిరి డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.
దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్ - గచ్చిబౌలి
వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ ముఠాను మల్కాజ్గిరి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి భారీ నగదు, చరవాణులను స్వాధీనం చేసుకున్నారు.
దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా అరెస్ట్
మారుతి నగర్‌లోని బాలాజీ కాస్మెటిక్స్‌లో నిన్న చోరీ జరిగింది. యజమాని ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 8మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గతంలో.. కూషాయిగుడా, గచ్చిబౌలి, చందానగర్ తదితర ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని డీసీపీ రక్షితమూర్తి తెలిపారు.
ఇదీ చదవండి:సగం కాలిన స్థితిలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం