తెలంగాణ

telangana

ETV Bharat / crime

Ganja seize in Hyderabad: కార్లలో గంజాయి ప్యాకెట్లు.. 462 కిలోలు స్వాధీనం..

ద్విచక్రవాహనాల్లో 450 కిలోల గంజాయి తరలింపు
ద్విచక్రవాహనాల్లో 450 కిలోల గంజాయి తరలింపు

By

Published : Nov 11, 2021, 8:12 AM IST

Updated : Nov 11, 2021, 11:43 AM IST

08:08 November 11

కార్లలో 450 కిలోల గంజాయి తరలింపు

Ganja seize in Hyderabad

మేడ్చల్ జిల్లా పరిధిలోని కౌకుర్ దర్గా వద్ద భారీగా గంజాయి(cannabis seized in medchal) పట్టుబడింది. రెండు కార్లలో తరలిస్తున్న 462 కిలోల గంజాయి(462 kilograms of cannabis seized in medchal)ని ఆబ్కారీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ కోటి రూపాయల పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

గంజాయి(cannabis seized in medchal) తరలిస్తున్న నలుగురిని ఆబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు కార్లను సీజ్ చేశారు.  ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో గంజాయిని తీసుకొని కర్ణాటక, మహారాష్ట్రకు తరలించేందుకు స్మగ్లర్లు ప్రయత్నిస్తుండగా అబ్కారీ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో మహ్మద్ ఫరీద్, ఇస్మాయిల్, సచిన్ చవాన్, బస్వరాజు అరెస్టు చేశారు. నిందితులు గతంలో కూడా పలుమార్లు గంజాయి స్మగ్లింగ్​లో పాల్గొన్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు పూర్తయితే పలు విషయాలు తెలుస్తాయని భావిస్తున్నారు. 

సీఎం ఆదేశాలతో మెరుపుదాడులు

రాష్ట్రంలో గంజాయిని(cannabis prevention measures) కట్టడి చేయడంపై గత నెలలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. అటవీ (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) భూముల్లో గంజాయి సాగు చేస్తే పట్టాలు రద్దు చేస్తామని... రైతు బంధు, బీమా వంటివి నిలిపేస్తామని హెచ్చరించారు. గంజాయి అక్రమ సాగు, వినియోగంపై ఉక్కుపాదం మోపాలని యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. సీఎం ఆదేశాలతో గంజాయి కట్టడికి రాష్ట్ర పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు ప్రారంభించారు. ఎక్కడికక్కడే గాంజా తరలింపును అడ్డుకున్నారు. గంజాయి సాగును నిర్వీర్యం చేశారు.

కొద్దిరోజులుగా గంజాయి తరలింపు కేసులు తగ్గుముఖం పట్టాయనుకునేలోగానే మేడ్చల్ జిల్లాలో భారీగా సరుకు పట్టుబడింది. పోలీసులు పట్టుకుంటారనే భయం లేకుండా ద్విచక్రవాహనాల్లో గంజాయిని తరలించారు. ఈ కేసులో నలుగురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరోవైపు.. గంజాయి వాడకం(marijuana usage) అనేక అనర్థాలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. బాధితుల్లో ఆందోళన, గుండె దడ, గుండెపోటు, మానసిక అనారోగ్య లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. దీర్ఘకాలం గంజాయి తీసుకుంటే కానబనాయిడ్‌ హైపరమెసిస్‌ సిండ్రోమ్‌ (సీహెచ్‌ఎస్‌) అనే రుగ్మతతో బాధపడతారని తెలిపారు. పదే పదే వికారం కలుగుతూ వాంతులవుతాయన్నారు. కొన్ని సందర్భాల్లో అది మరణానికీ దారితీస్తుందని హెచ్చరించారు. 

ఒకటి రెండు వారాలు గంజాయి(marijuana damages health) తీసుకుని ఆపేసిన వారిలోనూ భయం, వణుకు, నిద్రలేమి, ఆకలి తగ్గడం, చెమటలు పట్టడం, మానసిక పరిస్థితి సవ్యంగా లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ద్రవ, స్ప్రే రూపంలో గంజాయి తీసుకుంటే- తలనొప్పి, మగత, పొడినోరు, వికారం, మతిస్థిమితం దెబ్బతినడం వంటివి తలెత్తుతాయని చెబుతున్నారు. గంజాయిని పొగ రూపంలో సేవిస్తే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి. దీర్ఘకాలంలో ప్రాణాలే పోతాయని హెచ్చరిస్తున్నారు.

Last Updated : Nov 11, 2021, 11:43 AM IST

ABOUT THE AUTHOR

...view details