తెలంగాణ

telangana

ETV Bharat / crime

life imprisonment sentence: భార్య మేనమామ హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు - తెలంగాణ నేర వార్తలు

Murder case judgement: భార్య మేనమామ హత్యకేసులో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు జీవితఖైదు విధించింది. భార్యాభర్తల మధ్య గొడవల నేపథ్యంలో... తనను భార్య మేనమామ మందలించాడనే కోపంతో నిందితుడు గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు తెలిపారు.

life imprisonment sentence, murder case judgement
భార్య మేనమామ హత్యకేసులో నిందితుడికి జీవితఖైదు

By

Published : Nov 30, 2021, 10:04 AM IST

Life imprisonment sentence in murder case: భార్య మేనమామను గొడ్డలితో నరికి చంపిన ఘటనలో నిందితుడికి మల్కాజిగిరి కోర్టు జీవిత ఖైదును సోమవారం విధించింది. తన భార్యను తనకు కాకుండా చేస్తున్నాడనే కోపంతో హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ మీర్​పేట హౌసింగ్ బోర్డులో నిందితుడు ఇప్పల శ్రీనివాస్, భార్య రేణుక 2014 నుంచి నివసించేవారు. వీరికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య రేణుక ఎవరితో మాట్లాడినా శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేసేవాడని... తరుచూ తాగి వచ్చి భార్యతో గొడవకు దిగేవాడని పోలీసులు తెలిపారు. భర్త వేధింపులు తట్టుకోలేక ఆమె పుట్టింటికి వెళ్లింది. శ్రీనివాస్ మద్యానికి బానిసై... భార్య మేనమామ పోలేపాక శ్రీనివాస్​ను సంప్రదించి.. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టారు. అందరి ముందు తనను మందలించడంతో భార్య మేనమామపై పగ పెంచుకొని... గొడ్డలితో నరికి చంపాడని పోలీసులు వెల్లడించారు.

మృతుని భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి... విచారణ జరిపి ఆధారాలు కోర్టుకు అందజేశారు. వాదనలు విన్న మల్కాజిగిరి కోర్టు నిందితుడు ఇప్పల శ్రీనివాస్​కు రూ.పదివేల జరిమానా, జీవిత ఖైదు విధించింది.

ఇదీ చదవండి:హైదరాబాద్​కు చెందిన నగల వ్యాపారి సంజయ్​ కుమార్​ అరెస్ట్​..

ABOUT THE AUTHOR

...view details