తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి - Road accident in Tirupati district
13:29 January 25
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి
ROAD ACCIDENT IN TIRUPATI : ఏపీలోని తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం కల్రొడ్డుపల్లి వద్ద కల్వర్టును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం.. క్షతగాత్రులను తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సంగతి తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన వారిని, క్షతగాత్రులను మహారాష్ట్ర వాసులుగా గుర్తించారు. తిరుమల దర్శనం తర్వాత కారులో కాణిపాకం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:కుమార్తెలను విక్రయించిన తండ్రి, సవతి తల్లి.. పెళ్లి చేసుకొని చిత్రహింసలు పెట్టిన భర్తలు
నదిలో ఒకే కుటుంబంలోని ఏడుగురి మృతదేహాలు.. ఆత్మహత్య కాదు హత్యేనట!