తెలంగాణ

telangana

ETV Bharat / crime

అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి - malla reddy college student suspicious death

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కళాశాల సమీపంలోని వసతి గృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో మృతదేహం లభ్యమైంది. పోలీసులు సేకరించిన సీసీటీవీ ఫుటేజీలో విద్యార్థిని భవనంపై నుంచి దూకిన దృశ్యాలు కనిపించాయి.

maisammaguda malla reddy college student suspicious death in medchal district
అనుమానాస్పద స్థితిలో మల్లారెడ్డి కళాశాల విద్యార్థిని మృతి

By

Published : Mar 23, 2021, 10:32 AM IST

Updated : Mar 23, 2021, 11:59 AM IST

మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన చంద్రిక అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రిక మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది.

అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థిని మృతి

కళాశాలకు సమీపంలో ఉన్న కృప ప్రైవేట్ వసతి గృహంలో ఉంటోంది. వసతిగృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. చంద్రిక భవనంపై దూకిన దృశ్యాలు కనిపించాయి. వసతి గృహం నిర్వాహకులను, విద్యార్థులను పోలీసులు ఆరా తీశారు. కేసు నమోదు చేసుకుని విద్యార్థిని మృతికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్నారు.

Last Updated : Mar 23, 2021, 11:59 AM IST

ABOUT THE AUTHOR

...view details