మేడ్చల్ జిల్లా మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థినిది ఆత్మహత్య అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
మనస్తాపంతోనే విద్యార్థిని ఆత్మహత్య! - మల్లారెడ్డి కళాశాల విద్యార్థిని ఆత్మహత్య కేసు
మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని చంద్రికది ఆత్మహత్యేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధరించారు. 15కు పైగా సబ్జెక్టుల్లో తప్పడం వల్ల ఒత్తిడితోనే బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చంద్రిక... మల్లారెడ్డి కళాశాలలో నాలుగో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. ఫిబ్రవరి 4 నుంచి పరీక్షలు ఉండడం వల్ల కళాశాల సమీపంలోని కృప వసతి గృహంలో చేరింది. ఇవాళ వసతిగృహం పక్కనే ఉన్న ఖాళీ ప్రదేశంలో విద్యార్థిని మృతదేహం కనిపించింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. సీసీటీవీ ఫుటేజీ పరిశీలించగా.. చంద్రిక భవనంపై దూకిన దృశ్యాలు కనిపించాయి. విద్యార్థినికి 15కు పైగా సబ్జెక్టులు బ్యాక్‌లాగ్స్ ఉండడం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.