విశాఖలో సంచలనం రేపిన నిత్య పెళ్లికొడుకు అరుణ్ కుమార్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ, పెళ్లి పేరుతో మహిళలకు వల వేసి వారిని మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్న మోసగాడి ఉదంతం నిన్న వెలుగులోకి వచ్చింది. పోలీస్ బాస్ గౌతమ్ సవాంగ్ ఆదేశాలతో విశాఖ పోలీసులు అరుణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి వరకు అరుణ్‌కుమార్ పెళ్లి పేరుతో ఎంతమందిని మోసం చేశాడనే వివరాలు రాబడుతున్నారు. నిందితుడి నుంచి వచ్చిన సమాచారం మేరకు బాధితులను సంప్రదించే ప్రయత్నం చేస్తున్నారు. అరుణ్ కుమార్ చేతిలో మోసపోయిన వారు నేరుగా తమకు ఫిర్యాదు చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈకేసులో ఫిర్యాదు చేసిన ఇద్దరు బాధిత మహిళల నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. అరుణ్ కుమార్ కారణంగా ఇబ్బందులు పడుతున్న వారు చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది.