తెలంగాణ

telangana

ETV Bharat / crime

పక్కా పథకం ప్రకారమే.. బ్యాంకును కొల్లగొట్టేందుకు 2 నెలల నుంచి పథకం

Cyber Attack on mahesh bank: హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ కొల్లగొట్టిన కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. సర్వర్‌ హ్యాక్‌ చేసి డబ్బులు కాజేయడానికి దాదాపు 2 నెలల ముందే నుంచి పథకం రచించాడని గుర్తించారు. పక్కాగా ప్లాన్ అమలు చేసి బ్యాంక్‌ను కొల్లగొట్టాడని భావిస్తున్నారు. ఈ నేరంలో సైబర్‌ నేరస్థుడికి ఒక మహిళ, మరో వ్యక్తి సహకరించారని ప్రాథమిక ఆధారాలు సేకరించారు.

పక్కా పథకం ప్రకారమే.. బ్యాంకును కొల్లగొట్టేందుకు 2 నెలల నుంచి పథకం
పక్కా పథకం ప్రకారమే.. బ్యాంకును కొల్లగొట్టేందుకు 2 నెలల నుంచి పథకం

By

Published : Jan 27, 2022, 3:20 AM IST

Cyber Attack on mahesh bank: మహేశ్ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వర్ హ్యాక్‌ చేసి 12.90 కోట్ల రూపాయలు కొల్లగొట్టిన కేసులో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. పక్కా పథకం ప్రకారమే దోపిడీ జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. నగదు బదిలీ చేసుకునేందుకు కార్యాచరణ రూపొందించి రెండు నెలల నుంచి అమలు చేశాడని అంచనా వేస్తున్నారు. రూ.12.90కోట్లు నగదు బదిలీ చేసుకునేందుకు నాలుగు ఖాతాలు వినియోగించాడని, ఇందులో ఇద్దరికి సైబర్‌ నేరస్థుడితో సంబంధం లేదని భావిస్తున్నారు. బషీర్‌బాగ్, బంజారాహిల్స్, పాతబస్తీ, కూకట్‌పల్లిలోని ఏపీ మహేశ్‌బ్యాంక్‌ శాఖల సమాచారం సేకరించాడని తెలుసుకున్నారు. సైబర్‌ నేరస్థుడు వినియోగించిన ఖాతాల వివరాలను పరిశీలిస్తున్నామని, ఇప్పటికే కొంతమందిని విచారించామని పోలీసులు తెలిపారు.

ఫార్మాకంపెనీ పేరుతో కూకట్‌పల్లిలో ఖాతా..

మహేశ్‌ బ్యాంక్‌ నుంచి నగదు కాజేందుకు వీలుగా సైబర్‌ నేరస్థుడు కూకట్‌పల్లిశాఖలో గతేడాది డిసెంబర్‌లో ఫార్మాహౌస్‌ పేరుతో ఓ ఖాతాను ప్రారంభించాడు. ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌ చేసిన నిందితుడు ఈనెల 23న... రూ.50లక్షల నగదును ఆ ఖాతాలోకి బదిలీచేశాడు. అందులో నుంచే ఈశాన్య రాష్ట్రాల్లోని వేర్వేరు ఖాతాలకు పంపించాడు. ముంబయికి చెందిన ఓ మహిళ బషీర్​బాగ్ శాఖలో ఓ ఖాతా తెరిచింది. ఈ రెండు అకౌంట్లకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.

మూడు బ్యాంకుల దోపిడీ ఒక్కడే..!

తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్, ఓ విదేశీ బ్యాంక్‌లో సర్వర్‌ హ్యాక్‌ చేసి నగదు కొల్లగొట్టిన నేరస్థుడు.. ఇప్పుడు మహేశ్ బ్యాంక్ దోపిడీ చేసిన వ్యక్తి ఒక్కడేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మూడు బ్యాంకులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది ఒకే బహుళజాతి సంస్థ. ఈ సంస్థ నుంచి రక్షణ వ్యవస్థను మూడు బ్యాంకులు కొనుగోలు చేశాయి. ఏపీ మహేశ్‌ కో-ఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌చేసిన నిందితుడు తొలుత మహిళ ఖాతాలో 6.90కోట్లు జమచేశాడు. తర్వాత రెండు ఖాతాల్లోకి, చివర్లో కూకట్‌పల్లిలో తాను తెరిపించిన ఖాతాలోకి రూ.50లక్షలు నగదు జమచేశాడు.

  • తెలంగాణ సహకార అపెక్స్‌బ్యాంక్, ఖైరతాబాద్‌లోని విదేశీ బ్యాంక్, ఏపీ మహేశ్‌ బ్యాంక్‌లకు సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది ఒకే బహుళజాతి సంస్థ. ఈ సంస్థ నుంచి రక్షణ వ్యవస్థను మూడు బ్యాంకులు కొనుగోలు చేశాయి.
  • గతేడాది జులై నెలాఖరులో సైబర్‌ నేరస్థుడు తెలంగాణ సహకార అపెక్స్‌ బ్యాంక్‌ సర్వర్‌ను హ్యాక్‌ చేసి ఆ బ్యాంక్‌కు చెందిన మూడుశాఖల్లో తన అనుచరుల ఖాతాల్లోకి రూ.2.25కోట్లు నగదు బదిలీ చేసుకున్నాడు.
  • గతేడాది ఆగస్టు నెలాఖరులో సైబర్‌ నేరస్థుడు ఖైరతాబాద్‌లోని ఓ విదేశీబ్యాంక్‌ సర్వర్‌ హ్యాక్‌ చేశాడు. అందులో ఓ ఖాతాను ఎంచుకుని రూ.1.96కోట్లను నగదు బదిలీ చేసుకున్నాడు. అక్కడి నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లోని నగరాల్లో బ్యాంకులకు పంపించాడు. తన బ్యాంక్‌ ఖాతాలో రూ.1.96కోట్లు మాయమయ్యాయని ఖాతాదారు ప్రశ్నించగా.. పరువుపోతుందని భావించి రూ.1.96కోట్లు బ్యాంక్‌వారే జమచేశారు.
  • ఏపీ మహేశ్‌ కోఆపరేటివ్‌ బ్యాంక్‌ ప్రధాన సర్వర్‌ను హ్యాక్‌చేసిన నిందితుడు తొలుత మహిళఖాతాలో రూ.6.90కోట్లు జమచేశాడు. తర్వాత రెండు ఖాతాల్లోకి, చివర్లో కూకట్‌పల్లిలో తాను తెరిపించిన ఖాతాలోకి రూ.50లక్షలు నగదు జమచేశాడు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details