మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతోన్న ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 6 చరవాణులు, రూ.60 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు.
జిల్లా కేంద్రానికి చెందిన.. ఉదయ్, శ్రీను, సంప్రీత్, సాగర్, ఉమేశ్, రాంప్రసాద్‌లు బెట్టింగ్‌కు పాల్పడుతున్నారన్న సమాచారంతో దాడి చేసి రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతోన్న నేపథ్యంలో.. యువత ఆన్లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతూ నిమిషాల్లో లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారని ఏఎస్పీ యోగేశ్ గౌతమ్ పేర్కొన్నారు.