గంజాయి విక్రయిస్తున్న మధ్యప్రదేశ్ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పాన్ బాయిబసోర్ అనే మహిళ నుంచి 4.4 కిలోల గంజాయిని పటాన్‌చెరు అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామ పరిధిలో నిర్వహించిన దాడుల్లో గంజాయిని పట్టుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్ - సంగారెడ్డి జిల్లా వార్తలు
గంజాయి విక్రయిస్తున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామ పరిధిలో దాడులు నిర్వహించారు. ఆమె వద్ద నుంచి 4.4 కిలోల మత్తు పదార్థాన్ని పటాన్‌చెరు అబ్కారీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
గంజాయి విక్రయిస్తున్న మహిళ అరెస్ట్
కొల్లూరు గ్రామ పరిధిలో నిర్మిస్తున్న రెండు పడక గదుల ఇళ్ల పక్కన రేకులు షెడ్డులో ఆబ్కారీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో గంజాయి విక్రయిస్తున్న మహిళను పట్టుకున్నామని అబ్కారీ సీఐ సీతారాం రెడ్డి తెలిపారు. నిందితురాలిని సంగారెడ్డి కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు.