తెలంగాణ

telangana

ETV Bharat / crime

Viral : నిందితుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ దృశ్యాలు - viral video of madhapur accident

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఆడీ కారు ఆటోను ఢీకొట్టిన ఘటనకు సంబంధించిన సీసీ దృశ్యాలు నిందితుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. అతివేగంగా వచ్చిన కారు.... ఆటోను ఢీకొట్టగా.... అనేక పల్టీలు కొట్టింది. అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డైన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి.

యాక్సిడెంట్, మాదాపూర్ యాక్సిడెంట్
యాక్సిడెంట్, మాదాపూర్ యాక్సిడెంట్

By

Published : Jun 29, 2021, 2:34 PM IST

ఇటీవల హైదరాబాద్​లోని మాదాపూర్​లో ఆడీ కారు ఓ ఆటోను ఢీకొట్టిన ఘటనలో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను సైబరాబాద్​ పోలీసులు తమ అధికారిక ట్విటర్​లో పోస్టు చేశారు. నగరానికి చెందిన సుజిత్ రెడ్డి, ఆశిష్‌లు.... రాయదుర్గంలోని స్నేహితుని ఇంట్లో విందుకు హాజరయ్యారు. మద్యం సేవించి.. మత్తులోనే కారులో బయలుదేరారు. కారు నడుపుతున్న సుజిత్ రెడ్డి.. మైహోం ఆబ్రా వద్ద మితిమీరిన వేగంతో ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు.

ఆటో అనేక పల్టీలు కొట్టగా... అందులోని ప్రయాణికుడు అక్కడికక్కడే మరణించాడు. ఆటో డ్రైవర్ గాయపడ్డాడు. నేరం నుంచి తప్పించుకునేందుకు సుజిత్‌, ఆశీష్‌లు నెంబర్‌ ప్లేట్లు తొలగించి... పారిపోయారు. అనంతరం సుజిత్‌ తండ్రి... వేరే డ్రైవర్‌ను తీసుకొని అతడే యాక్సిడెంట్‌ చేశాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఐతే సీసీటీవీ దృశ్యాలున్నాయని చెప్పి పోలీసులు అసలు విషయం బయటపెట్టారు. ప్రమాదానికి కారణమైన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.

నిందితుల నిర్లక్ష్యానికి నిదర్శనమే ఈ దృశ్యాలు

ABOUT THE AUTHOR

...view details