constable raped a woman : వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం చేసిన సంఘటన పోలీసు వర్గాల్లోనూ దుమారం రేపుతోంది. హైదరాబాద్‌లోని మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న వెంకటేశ్వర్లు దంపతులు, వివాహిత ఇంటి సమీపంలో ఉండేవాడు. బాధితురాలు, కానిస్టేబుల్ భార్య.. ఇద్దరు స్నేహంగా ఉండేవారు. ఈ నేపథ్యంలో చనువుగా ఉండే కానిస్టేబుల్, ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. అతన్ని తిరస్కరించడంతో మానసికంగా, శారీరకంగా వేధించడం మొదలెట్టాడు.
వివాహితపై కానిస్టేబుల్ అత్యాచారం... పోలీసు వర్గాల్లో దుమారం - హైదరాబాద్ వార్తలు
constable raped a woman : రక్షకులే భక్షకులుగా మారితే సమాజం ఏమై పోవాలి. చట్టాన్ని కాపాడాల్సిన వారే హద్దు మీరి భయోత్పాతాలు సృష్టించడం సబబేనా?... ఇది రాష్ర్టంలోని పోలీసు యంత్రాగం తీరని ప్రజలు నవ్విపోతున్నారు. ఇటీవల సంచలనం సృష్టించిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ రాజు, మాజీ ఇన్‌స్పెక్టర్ నాగేశ్వర్‌రావు ఘటనలు మరువక ముందే మరో దారుణం బయటపడింది. ఓ పోలీసు కానిస్టేబుల్ వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అతనిపై గతంలో పెట్టిన కేసు ఉపసంహరించుకోకపోతే ఆమె నగ్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించాడు. మీర్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
constable raped a woman in Hyderabad : పద్ధతి మార్చుకోకపోవడంతో బాధితురాలు సైదాబాద్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి వదిలిపెట్టారు. ఐనప్పటికీ వేధింపులు మాత్రం ఆపలేదు. పైగా అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు. బాధితురాలు మరోసారి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
జైలు నుంచి విడుదలైన వెంకటేశ్వర్లు ఆమెపై కక్షగట్టాడు. బాధితురాలి చిరునామా, ఫోన్ నెంబర్ తెలుసుకుని భర్త లేని సమయంలో ఆమె ఇంటికి వెళ్లాడు. తనకు సహకరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. తరచూ ఇంటికి వెళ్లి ఆమెపై అఘాయిత్యం చేసేవాడు. ఆమె ఫోటోలు, వీడియోలు సేకరించి బెదిరింపులకు దిగేవాడు. ఈ నెల 14వ తేదీన మరో సారి ఆమె ఇంటికి వెళ్లి... తనపై గతంలో పెట్టిన కేసు ఉపసంహరించుకోవాలంటూ బెదిరించాడు. మరోసారి అత్యాచారానికి యత్నించగా బాధితురాలు కేకలు వేయడంతో పరారయ్యాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కానిస్టేబుల్ వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు. చట్టాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన పోలీసులే కీచకులుగా మారితే ప్రజలు ఎవర్ని ఆశ్రయించాలని మేధావుల వాదన.