సంచలనం సృష్టించిన.. ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసు నిందితులు పురుషోత్తంనాయుడు, పద్మజ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విశాఖ మానసిక వైద్యశాలలో వారికి చికిత్స పూర్తైంది. వారిరువురినీ మదనపల్లె సబ్జైలు అధికారులకు అప్పగించనున్నారు.
మదనపల్లె జంటహత్యల కేసు: మానసిక వైద్యశాల నుంచి నిందితులు డిశ్చార్జ్ - ap news
ఏపీలోని చిత్తూరు జిల్లా మదనపల్లె జంటహత్యల కేసు నిందితులను.. విశాఖ మానసిక వైద్యశాల సిబ్బంది పోలీసులకు అప్పగించనున్నారు. తిరుపతి రుయా ఆస్పత్రి వైద్యుల సూచనల మేరకు పోలీసులు గతంలో వారిని అక్కడకు పంపించగా.. ఇప్పుడు చికిత్స పూర్తై డిశ్చార్జ్ అయ్యారు.
daughters murder case, madhanapalli case
ఇద్దరు కుమార్తెలను దారుణంగా హతమార్చిన పురుషోత్తంనాయుడు, పద్మజను.. విశాఖలోని మానసిక వైద్యశాలకు తరలించాలని తిరుపతిలోని రుయా ఆస్పత్రి వైద్యులు గతంలో చెప్పారు. వారి సూచనల మేరకు పోలీసులు నిందితులు ఇద్దరినీ చికిత్స నిమిత్తం విశాఖకు పంపించారు.
ఇదీ చదవండి:జంట హత్యల కేసు: వెలుగులోకి కొత్త నిజాలు..