తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..! - మదనపల్లె జంట హత్య కేసు వార్తలు

మూడు రోజుల కిందట ఏపీలోని చిత్తూరు జిల్లాలో కన్న కూతుళ్లను మూఢ భక్తితో హత్య చేసిన దంపతులు పురుషోత్తంనాయుడు, పద్మజను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. వీరు మదనపల్లె సబ్‌జైలులో ఉన్నారు. అయితే.. దంపతులిద్దరూ నిన్నటి నుంచి ఆహారం తీసుకోవట్లేదని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నిందితులను పరీక్షించిన వైద్యులు వారిని తిరుపతి రుయాకు తరలించాలని సిఫారసు చేశారు.

ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..!
ఆహారం తిరస్కరించిన దంపతులు.. చిత్రవిచిత్ర ప్రవర్తన..!

By

Published : Jan 28, 2021, 12:38 PM IST

Updated : Jan 28, 2021, 1:45 PM IST

జంట హత్య కేసులో నిందితులు .. ఆహారం తీసుకోవట్లేదని.. అధికారులు తెలిపారు. వైద్యుల సూచనలతో పోలీసులు దంపతులిద్దరినీ తిరుపతికి తరలిస్తున్నారు. ఈ మేరకు మదనపల్లె జైలు సూపరింటెండెంట్‌.. న్యాయమూర్తిని అనుమతి కోరారు. ఇదిలా ఉంటే.. పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి నిందితులు చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తున్నారు.

బుధవారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో భార్యాభర్తలను పోలీసులు వైద్యపరీక్షలకు తీసుకెళ్లారు. అక్కడ భార్య అరవడం వల్ల భర్త పురుషోత్తంనాయుడు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా.. ఆయన తన భర్తే కాదని తాను శివుడినని పక్కకు తోసేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: బిడ్డలిద్దరూ శివపార్వతులు.. నేను కాళికను

Last Updated : Jan 28, 2021, 1:45 PM IST

ABOUT THE AUTHOR

...view details