ఐయామ్ సో బ్యాడ్ డాటర్.. మిస్ యూ నాన్న.. అమ్మఅని సూసైడ్ నోట్ రాసి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎంటెక్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గచ్చిబౌలి పోలీసుస్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం తారుపల్లి గ్రామానికి చెందిన రఘుశాల లచ్చయ్య, రజిత దంపతుల కుమార్తె ఆర్.మౌనిక(27) హెచ్‌సీయూలో ఎంటెక్- నానో టెక్నాలజీ రెండో సంవత్సరం చదువుతోంది. క్యాంపస్‌లోని మహిళా వసతి గృహం-7లో ఉంటోంది.
సోమవారం ఉదయం నుంచి గదిలోంచి బయటకు రాలేదు. తోటి విద్యార్థులు వెళ్లి పిలిచినా స్పందన లేదు. వెంటిలేటర్లోంచి చూడగా కిటికీ చువ్వకు ఉరివేసుకుని కనిపించింది. ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఎంటెక్ విద్యార్థులను క్యాంపస్‌లోకి అనుమతించడంతో ఈనెల 18వ తేదీన హాస్టల్ గదికి వచ్చి ఉంటోంది.