Lover's Suicide: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రేమ జంట ఆత్మహత్యకు యత్నించింది. ప్రకాశం జిల్లా సింగరాయకొండకు చెందిన వేణు, దర్శికి చెందిన విష్ణు ప్రియ సహా జీవనం సాగిస్తున్నారు. నెల రోజుల క్రితం విష్ణు ప్రియ అదృశ్యమయ్యిందని కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మంత్రాలయం వచ్చి వారిద్దరు కారులో నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించారు.
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం, ప్రియుడి మృతి.. - విష్ణు ప్రియ అదృశ్యం
Lover's Suicide: ఆంధ్రపదేశ్‌లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. ప్రకాశం జిల్లాకు చెందిన ప్రేమికులు మంత్రాలయంలో నిద్రమాత్రలు మింగారు. వారిని గమనించిన స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. వారిద్దరిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ప్రియుడు మరణించగా.. కొన ఊపిరితో ఉన్న యువతికి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ప్రేమికుల ఆత్మహత్యాయత్నం
శ్రీ మఠం సెక్యూరిటీ సిబ్బంది వారిని గమనించి పోలీసులకు సమాచారం అందించగా.. ఎస్సై వేణు గోపాల్ రాజ్ ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే వేణు మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న విష్ణు ప్రియకి ఎమ్మిగనూరు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా విచారణ చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.
ఇవీ చదవండి: