Lovers Suicide Attempt: ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన ఓ ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం రాజన్‌పల్లి శివారు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామానికి చెందిన యువకుడు... అదే గ్రామానికి చెందిన యువతి మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించలేదు.
Lovers Suicide Attempt: 'ఇష్టంలేని పెళ్లి చేసుకోలేక... తనువు చాలించేందుకు సిద్ధమై' - Mahabubabad news
Lovers Suicide Attempt: మహబూబాబాద్ జిల్లాలో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని మనస్తాపానికి గురైన వీరు పురుగుల మందు ప్రాణాలు తీసుకోవాలనుకున్నారు.
Lovers Suicide Attempt
ఇటీవలే యువకుడికి మరో యువతితో... యువతికి కూడా మరో యువకుడితో ఇరు కుటుంబాల పెద్దలు నిశ్చితార్థం నిర్వహించారు. ఇష్టం లేని పెళ్లిని బలవంతంగా చేస్తున్నారని ఇరువురు ప్రేమికులు ద్విచక్ర వాహనంపై అటవీ ప్రాంతానికి వెళ్లి పురుగుల మందు తాగి పడిపోయారు. విషయం తెలుసుకున్న కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకొని గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స చేసిన వైద్యులు యువతి పరిస్థితి విషమంగా ఉండటంతో మహబూబాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
ఇవీ చూడండి: