వారిద్దరూ ప్రేమించుకున్నారు. కలిసి ఒక్కటవుదామనుకున్నారు. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు... ప్రేమించిన అమ్మాయిని అతను మర్చిపోలేకపోయాడు. ఆమె అతన్ని విడిచి ఉండలేక పోయింది. దీనితో కనీసం చావులోనైనా కలిసి ఉందామనుకున్నారు. ఇంట్లోనే ఆ ప్రేమ జంట ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం చోర్గాంలో చోటుచేసుకుంది. వీరి మృతితో రెండు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.
చావులోనైనా ఒక్కటవుదామని... ప్రేమజంట ఆత్మహత్య
ఇంట్లో ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
13:50 April 14
Lovers suicide: ప్రేమజంట ఆత్మహత్య
Last Updated : Apr 14, 2022, 2:05 PM IST