ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ప్రేమ పేరుతో ఓ జంట ఆత్మహత్యకు యత్నించారు. పట్టణంలోని ఓ లాడ్జిలో 17 ఏళ్ల బాలిక, 42 ఏళ్ల వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. అపస్మారక స్థితిలో ఉన్న వారిని గుర్తించిన లాడ్జి సిబ్బంది.. ఆసుపత్రికి తరలించారు.
దగదర్తి మండలం బాడుగులపాడుకు చెందిన రామయ్య అనే 42 ఏళ్ల వ్యక్తి, జలదంకి మండలం బ్రాహ్మణకాకకు చెందిన 17 ఏళ్ల బాలికతో ప్రేమాయణం సాగించాడు. రామయ్యకు ఇది వరకే వివాహమై ఇద్దరు ఆడ పిల్లలుండగా.. మగ పిల్లాడి కోసం వరసకు మరదలయ్యే బాలికతో ఈ వ్యవహారం సాగించినట్లు తెలుస్తోంది.