Lovers Suicide in Gadwal : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - lovers committed suicide in gadwal
![Lovers Suicide in Gadwal : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13194509-489-13194509-1632800739357.jpg)
09:01 September 28
Lovers Suicide in Gadwal : రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం మేళ్లచెరువులో విషాద ఘటన చోటుచేసుకుంది. మేళ్లచెరువు వద్ద రైలు కిందపడి యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పరిశీలించారు. మృతులను అనంతపురం జిల్లా ధర్మవరం వాసులు గంగాధర్, లక్ష్మీగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బలవన్మరణానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.