Lovers Suicide : నిర్మానుష్య ప్రాంతంలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడింది. అబ్దుల్లాపూర్‌మెట్ సీఐ వాసం స్వామి కథనం ప్రకారం.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం గండిచెరువు రహదారి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో రెండు మృతదేహాలు పడిఉండటం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా.. యువకుడు(25), యువతి(23) మృతదేహాలు పక్కపక్కన పడిఉన్నాయి. వారి పక్కన పురుగుల మందు సీసా ఉంది. అక్కడే బైకు నిలిపిఉంది.
Lovers Suicide : నిర్మానుష్య ప్రాంతంలో ప్రేమ జంట ఆత్మహత్య - రంగారెడ్డి జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
Lovers Suicide : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడిన జంటను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.
Lovers Suicide
ద్విచక్ర వాహన రిజిస్ట్రేషన్ నంబరు ఆధారంగా మృతుడు సతీశ్‌గా తెలిసింది. అతను నల్గొండ జిల్లా చింతపల్లి మండలం పోలేపల్లి గ్రామానికి చెందినవాడిగా భావిస్తున్నారు. మృతురాలు సైతం అదే గ్రామానికి చెందిన శిరీషగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరు ప్రేమికులని, ఈ ప్రాంతానికి వచ్చి విషం తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. కేసు నమోదు చేసి మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.