తెలంగాణ

telangana

ETV Bharat / crime

రైలు కింద పడి ప్రేమజంట బలవన్మరణం - పెళ్లూరు సమీపంలో రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

ఏపీలో ఓ ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భావనతో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నారు.

lovers-commits-suicide-near-pellur-ongole
రైలు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

By

Published : Mar 19, 2021, 2:43 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలులో ఓ ప్రేమజంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. పెళ్లూరు సమీపంలో రైలు కింద పడి మరణించారు. మృతులు చీమకుర్తివాసులుగా పోలీసులు భావిస్తున్నారు.

ప్రేమజంట పాలిటెక్నిక్ విద్యార్థులుగా పోలీసులు గుర్తించారు. యువకుడు మద్ది వెంకట సాయికృష్ణగా తేల్చారు. తమ ప్రేమ విషయంపై సహకారం కోసం వారం క్రితం చీమకుర్తి పోలీస్ స్టేషన్​కు వెళ్లినట్లు తెలిసింది. కులాలు వేరు కావడంతో పెళ్లికి పెద్దలు అంగీకరించరనే భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి:దూలపల్లి అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు

ABOUT THE AUTHOR

...view details