Lovers suicide: ఇద్దరు ఒకరిని ఒక్కరు ప్రేమించుకున్నారు. ఇంతలో అమ్మాయికి మరో వ్యక్తితో వివాహం జరిగింది. అయినప్పటికీ వారిద్దరి మధ్య ప్రేమానుబంధాలు వీడలేక మనస్తాపానికి గురయ్యారు. దీంతో ప్రేమికులిద్దరు చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాద ఘటన సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ మండలం పీర్లపల్లి అటవీ ప్రాంతంలో జరిగింది.
పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు! - ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య
20:58 May 24
పెళ్లితో ఒక్కటి కాలేక.. చావులో ఒక్కటయ్యారు!
రాజన్న సిరిసిల్ల జిల్లా రాజీవ్‌నగర్‌కు చెందిన నామ వేణుగోపాల్ (24), సిరిసిల్లకు చెందిన పూజ ఇద్దరు ఓ ఆస్పత్రిలో పని చేస్తూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఇద్దరిది ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కాగా.. ఇంతలోనే పూజకు మరో వ్యక్తితో ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. అయినప్పటికీ వేణుగోపాల్‌పై ప్రేమతో కట్టుకున్న భర్తను వదిలిపెట్టి ప్రియుడితోనే కలిసి ఉంటోంది. దీనికి ఇరువురి కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు. దీంతో వారిద్దరూ ఐదు రోజుల కిందట ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయారు. మూడు రోజుల క్రితం వీరు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:రెచ్చిపోయిన విద్యార్థులు.. కత్తులతో ఫైటింగ్
భర్త శవంతో రెండ్రోజులు ఇంట్లోనే... పోలీసులు తలుపులు బద్దలు కొట్టగానే...