రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య - Lovers Commit Suicide by falling under the train
![రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య Lovers Suicide](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17305193-545-17305193-1671943050899.jpg)
09:57 December 25
రైలు కిందపడి ప్రేమజంట ఆత్మహత్య
Lovers Commit Suicide: నారాయణపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణా మండలం చేగుంట రైల్వేస్టేషన్ సమీపంలో.. రైలు కింద పడి ఓ ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. మృతులు మణికుమార్, అనితగా గుర్తించారు. వీరు ఏపీలోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కందనూరు వాసులని తెలిపారు. వ్యవసాయ పనుల నిమిత్తం చేగుంట గ్రామానికి వచ్చారని వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవీ చదవండి:మట్టి గాజుల్లో మాదక ద్రవ్యాలు.. ముఠా ఆట కట్టించిన పోలీసులు
తిమింగలం వాంతితో దందా.. 25కేజీలు సీజ్ చేసిన పోలీసులు.. విలువ రూ.25కోట్లు!