వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన యువతికి, అదే గ్రామానికి చెందిన బస్వరాజ్‌తో (baswaraj) కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య పరిచయం కాస్త ప్రేమగా మారింది. శిరీష, బస్వరాజ్ ఇద్దరు హైదరాబాద్‌కు వచ్చి వేర్వేరుగా ఉంటున్నారు. హస్తినాపురంలోని తన పిన్ని ఉమశ్రీ వద్ద ఉంటోంది. వీరి ప్రేమను యువతి తల్లిదండ్రులు నిరాకరించారు. మూడు నెలల క్రితం ఆమెకు మరో వ్యక్తితో నిశ్చితార్థం జరిపించారు. కక్ష పెంచుకున్న బస్వరాజ్.... పథకం ప్రకారం యువతిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు.
చావు బతుకుల మధ్య..
తన ప్రియురాలిని వేరే ఇంటికి తరలించారన్న వార్త తెలుసుకుని.. ఆమె ఉంటున్న ఇంటి చిరునామా కోసం బసవరాజు తీవ్రంగా వెతికాడు. మొత్తానికి ఆమె చిరునామా కనుక్కున్నాడు. ప్రాణంగా ప్రేమించిన ప్రియురాలిపై కోపంతో.. కర్కషంగా దాడి చేశాడు (lover attack on his girl friend). తన వెంట తెచ్చుకున్న కత్తితో యువతి కడుపు, వెన్నులో పొడిచాడు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా మారింది. ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది.
వేరొకర్ని పెళ్లి చేసుకుంటున్నానని బస్వరాజు పొడిచాడు. గతంలో మేమిద్దరం ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. ఇప్పుడు వేరే వ్యక్తితో నిశ్చితార్థమైంది. రోడ్డు మీద అందరూ చూస్తుండగా కత్తితో పొడిచాడు. - బాధితురాలు
48 గంటలు గడిస్తే గాని ఓ అంచనాకు రాలేము